Ancient grain storage tradition fading fast

zetnws
12 Feb 2026
Health

అనగనగా ఒక ఊరు. ప్రతి ఇంటి ముందూ ఒక పాతర. అలా ఆ ఊరు నిండా పాతర్లే. చిన్న పిల్లలు ఒక పాతర మీద నుంచి మరో పాతర మీదకు ఎక్కి దిగుతూ మోకాళ్లు చెక్కించుకునేవాళ్లు, బోలెడన్ని ఆటలు ఆడుకునేవాళ్లు. కుర్రాళ్లు కబుర్లు చెప్పుకునేవాళ్లు. అమ్మలక్కలు ముచ్చట్లు ఆడుకునేవాళ్లు. రాత్రయితే చాపలు పరుపులు వేసుకొని చక్కగా వెన్నెలను ఆస్వాదిస్తూ పడుకునేవాళ్లు. ఇదంతా ఉత్తరాంధ్ర, ఆంధ్రా ఒడిషా బోర్డర్ లో జరిగిన గతం. మరి ఇప్పుడో పాతర్లు తగ్గిపోయాయి. దానితోపాటే బోలెడన్ని జ్ణాపకాలు. అయితే అసలు పాతర్లేంటీ.. ఎందుకేస్తారు.. లాభమేంటి? ఇంకా గ్రామీణులు పాతర బియ్యాన్నే ఎందుకు ఇష్టపడుతున్నారు? అదే ఇవాళ్టి ముచ్చట.
వాయిస్
పాతర పరిచయానికి ముందు ఇలాంటి బోలెడన్ని గ్రామీణ సంగతుల కోసం విలేజ్ వ్యాన్ చానెల్ ను ఒక్కసారి సబ్ స్క్రైబ్ చేసేస్తారుగా. లైక్, షేర్, కామెంట్.. మరచిపోవద్దు.
వాయిస్
రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం, తినడానికీ బాగుంటుంది.. అందుకే పాతర్లు వేయడానికే పాతతరంవాళ్లు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటితరానికి అంత ఓపికలెక్కడివి. వేగంగా పండాలి. ఎక్కువ ధాన్యం రావాలి. అక్కడే అమ్ముకోవాలి. షుగర్ జబ్బులొచ్చే సన్న బియ్యం ప్యాకెట్లు కొనుక్కు తినాలి. తొందరగా పోవాలి. అంతా ఫాస్టే.
వాయిస్
మా చిన్నప్పుడు పాతర్లపై ఎన్ని ఆటలో.. మరెన్ని దెబ్బలో. ఇప్పుడు పాపం పిల్లలకు బాల్యమే లేదు. ఇంకెక్కడి ఆటలు.
వాయిస్
ఇప్పటికీ జగదీష్ లాంటి కొంతమంది యువత పాతర బియ్యంపై మక్కువ వదులుకోకపోవడం వల్లే ఇంకా పాతర్లు రాజ్యమేలుతున్నాయి.
వాయిస్
పాతర్లు తగ్గడానికి ప్రధాన కారణాల్లో జనాలకు అంత ఓపిక లేకపోవడం, సులభంగా దొరికే వాటిని ఇష్టపడటం, ఇంటి ముందు రోడ్లు, గచ్చులు వేసుకోవడంతో మట్టి వాకిళ్లు లేకపోవడం, పనిచేయడానికి ఇష్టపడకపోవడం, కూలీలు లేకపోవడం.. ఇలాంటి కారణాలు చాలా ఉన్నాయి.
వాయిస్
ఈ కారణాలతో పాతర్లు తగ్గిపోగా ఇష్టాన్ని చంపుకోలేని వాళ్లు నలుగురైదుగురు కలిసి ఒక పాతర వేసుకుంటున్నారు ఈ మధ్య.
వాయిస్
ఇప్పుడు షుగర్లు, బీపీలు రావడంతో చాలామంది పాతర బియ్యాన్ని కోరుకుంటున్నారు. కానీ అవి దొరకడం లేదు.
వాయిస్
అసలు పాతర తియ్యడమే భలే గమ్మత్తుగా ఉంటుంది. అదెలా తీస్తారో వాళ్లే చెబుతారు వినండి.
వాయిస్
పాతరని ఒరియాలో ఖొణీ అంటారట.
వాయిస్
మీకు తెలుసోలేదో నాకు తెలీదు గానీ అప్పట్లో ధాన్యాన్ని ఉడకబెట్టి ఎండబెట్టి దంచుకొని ఆ బియ్యాన్నే తినేవాళ్లు. ఆ ధాన్యాన్ని ఉడకబెడుతున్నప్పుడు అదో వింత గమ్మత్తైన వాసన వస్తుండేది. ఆ వాసనకు మరేదీ సరిపోలదు.
వాయిస్
ఉత్తరాంధ్రలో ఎవరైనా లావుగా ఉంటే దిబ్బలాగున్నాడంటారు. ఆ పదం వచ్చిందే దీని వల్ల. దీనినే దిబ్బ అంటారు.
వాయిస్
అప్పట్లో ధాన్యాన్ని కట్టల్లో, కుచ్చిర్లలో, ఇలా దిబ్బల్లో, పాతర్లలో.. రకరకాల పద్ధతుల్లో నిలువ చేసుకునేవాళ్లు.
వాయిస్